పుట:NagaraSarwaswam.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

117


పైకెత్తవలసియుండునని గ్రహింపవలెను. కర్కటమనగా పీత. పీతల కలయిక ఇట్టిదగుటచే దీనికి కార్కటబంధమను పేరువచ్చెను.

16. ప్రేంఖణబంధము :- "ప్రేంఖణము" అనగా విసరుట. కార్కటబంధమునందువలెనే భార్యాభర్తలుకూడి రమించుచుండగా - భార్య భర్తయొక్క నాభిదేశమునందుంచిన తనపాదములతో నాతనిని పైకెత్తి విసరుచు కూడినచో ఆ స్థితి 'ప్రేంఖణబంధము' అనబడును.

17. మార్కటకబంధము :- భార్య శయ్యపై వెలికిలగా శయనించియుండగా - పురుషుడును చాచబడిన కాళ్ళుకలవాడై ఆమె శరీరమును తనశరీరముతో నాక్రమించుకొని - తన ఎడమచేతి నామె నడుముక్రిందనుండి పోనిచ్చి - ఆమెను గాఢముగా కౌగలించుకొని - కుడిచేతితో ఆమెయొక్క స్తనమునుగ్రహించి కూడగా - భార్య తన చాచబడిన కాళ్ళను భర్తయొక్క కాళ్ళక్రిందనుండి తొలగించి - అతని పిక్కలపై తన పాదములను జేర్చి మెలివేసినట్లు పట్టి యుంచినచో ఆ స్థితి మార్కటకబంధము అనబడుతుంది.

18. ఉద్భుగ్నబంధము :- ఉన్నతముగానుండి కొంచెము వంగియుండుటను ఉద్భుగ్నము అంటారు. శయ్యపై వెలికిలగా శయనించియున్న భార్యయొక్క తొడలను భర్త తనచేతులతో పైకెత్తి - క్రిందకు వంచియుంచి - చేతులతో నొక్కుచు రమించుట ఉద్భుగ్నబంధమని పేరు. ఇందు భార్యయొక్క తొడలు పైకెత్తబడి వంచబడును గనుక దీనికీపేరు వచ్చెను.

19. ఆయతబంధము :- భార్యశయ్యపై వెలికిలగా శయనించినదై - భర్తయొక్క శిరస్సుమీద తనకాలి నొకదానిని (కాలిపిక్క శిరమునకు తగునట్లు) చాచి, వేరొకదానిని శయ్యమీదనేచాచి యుంచగా ఏర్పడు కూటమికి ఆయతబంధ మనిపేరు. రతిరహస్యకారుడు ఈ బంధమును 'శూలచితబంధము' అను పేరుతో పేర్కొనెను.