పుట:NagaraSarwaswam.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108


బలుస్తుంది. ఆమెలో యౌవనం స్థిరనివాసం ఏర్పరచుకొంటుంది. అందుచేపురుషుడు స్త్రీయోనిలో వామభాగమున నెలకొనివుండే సుభగా నాడిని దృష్టియందుంచుకొని దానియందు గాఢస్పర్శ ఏర్పడవలెనన్న సంకల్పముతో తనఅంగముతో యోనిలోని వామభాగమును కలచాలి.

అట్లుకాక పురుషుడు స్త్రీ యోనిలో సుభగా నాడికిఎదురుగా కుడివైపున ఉండే దుర్భగానాడి యందు ప్రేరణ కలిగించుటవలన కాలంగడచేకొలది ఆమెలోని లావణ్యం అంతరిస్తుంది. ఆమె శరీరం కర్కశంగా ఎండిన కట్టెలా తయారవుతుంది. ఆమె దేహచ్ఛాయ కూడ నశిస్తుంది. అకాలంలోనే వార్ధకం ఆమె శరీరంలోకి తొంగిచూస్తుంది. అంతేకాక ఆమె ఎల్లపుడు ఏదో ఒక రోగముతో బాధపడేదవుతుంది. అందుచే పురుషుడు దుర్భగానాడియందెన్నడును ప్రేరణ కలిగింపరాదు.

ఇకయోనియొక్క అధస్తలమందున్న పుత్రీ దుహిత్రిణీ నాడులలో పుత్రీనాడి యోనియందు ఎడమభాగమున దుహిత్రిణీనాడి కుడివైపున ఉన్నవని చెప్పబడెను కదా! ఈ పుత్రీనాడియందు పురుషుడు తన పురుషాంగము ద్వారా ప్రేరణ కలిగించినపుడు స్త్రీ గర్భమును ధరిస్తే పుత్రునే ప్రశవిస్తుంది. ఇక దుహిత్రిణీనాడి యందు పురుషాంగము ద్వారా ప్రేరణ కలిగినపుడు స్త్రీ గర్భమును ధరిస్తే 'దుహిత' అనగా కూతురు జన్మిస్తుంది. ఈ కారణముచే తనకు పుత్రులు జన్మింపవలెనని కోరువాడు తనభార్యతో కలసినపుడు రతివేళ తన అంగముద్వారా ఆమెయొక్క యోనికి లోతట్టున ఎడమవైపున మాత్రమే గాఢస్పర్శ కలిగించాలి. అట్లుకాక తనకుపుత్రిక జన్మింపవలెనని కోరువాడు భార్యయొక్క యోనిలో కుడిభాగమున ప్రేరణ కలిగించవలసి ఉంటుంది.

పద్మశ్రీయొక్క అభిప్రాయానుసారము ఈ చెప్పబడిన ఆరు నాడులకును యోనియే స్థానమైఉన్నది. కాని కొందరు దీనికి భిన్నముగా వీని స్థానములను పేర్కొనుచున్నారు. ఈ విషయమునుకూడ పద్మశ్రీ 'కొందరిట్లనుచున్నారని' తన గ్రంథమున మతాంతరమును పేర్కొనెను.