పుట:Naganadham.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెళ్ళేదని సంశయించకు. మేము తిరస్కరిణీవిద్య నిస్తాము. దాని ప్రభావంవలన నీవు ఇతరులకు కనపడవు. ఆ విద్య నీ స్వేచ్చ ననుసరించి పనిచేస్తుంది. కల్లకపటాలు విడిచి మాకు సహాయ్యపడగల ఉత్తముడు నీకంటె మాకు మరొకదు దొరకడు" అని చెప్పేరు.

   ఔదార్య గాంభీర్యానికి నిధి అయిన నలుడు తానాశించిన ఫలితానికి దైవికంగా వచ్చిన యీ ఆటంకాన్ని చూచి లోలోపల నవ్వుకున్నాడు.  సరేనని ఒప్పుకొని దేవతల వద్ద తిరస్కరిణీవిద్య గ్రహించాడు.  "తనను వరించమని హంసద్వారా వర్తమానమంపిన మహారాజు, తానే స్యవముగా దేవతలను వరించమని వర్తమానం తెచ్చి దమయంతి కివ్వబోయాడు!  ఏమి భగద్విలాసం! ఇంతకీ దమయంతి ఎవరిని వరిస్తుందో!" అని అనుకొంటూ నలుడు అంత:పుర ద్వారాన్ని సమీపించాడు.
  అది రాణివాసం, పోతుటీగకూడ లోనికిపోరానిచోటు. లోపల అంతా ఆడారి మయం. ఆరోజు స్వయంవర సన్నాహాల వల్ల అక్కడ మరీ కలకలగాఉంది. ఎక్కడ చూచినా దాసీల హడావుడులే. వచ్చేవారు, పోయేవారు, మంతనాలాడే వారు, నవ్వేవారు, నవ్వుతాలాడేవారు ఒకరినిమించి ఒకరన్నట్లు చెలగాటమాడి తిరుగుతున్నారు దాసీలు, వారి మధ్యనుండి దమయంతి అభ్యంతర మందిరము లోకి దారి తీసేడు నలుడు.  ఇతడేమోవారికి కనపడడు.  కాని అతనికి కనిపిస్తారు. ఎదురుగావచ్చి మెదపడేటంత హడావిడిలో వా