పుట:Naganadham.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తీయబోయాను, కాని నీ ధైర్యసాహసాలతో నీవు నా హృదయాన్నే తీసిచేసేవు. నీవెవరు?" అని గరుడుడు జీమూతవాహనుణ్ణీ అడిగేడు.

    "నేనెవరైతేనేమి? మొదట తమరు తమఆకలి తగ్గించుకొండి. తర్వాత అన్నీ తెలుస్తాయి" అన్నాడు జీమూతవాహనుడ్. ఇంతలో వెనుకనుంచి శంఖచూడుని కేక వినపడింది. "పక్షిరాజా, అన్యాయంగా మీరు విద్యాధరుణ్ణి చంఫి తింటున్నారు. అతనిని వదలండి. ఇదుగో నేను వస్తున్నాను. ఈ రోజునమీకాహారంగా రావలసిన వాడిని నేను. నాకు బద్లు యీ దయామయుడు తన ప్రాణాన్ని మీకు బలియిచ్చేడు. అతని తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య, బంధువులు అంతా వెనకనుండి వస్తున్నార్, అల్తనిని విడిచి పెట్టి పుణ్యం కట్టుకొండి" అని అరుస్తూ గాభరాగాపరుగెతి వచ్చా శంఖచూడుడు.
    గరుడుడు తటాలున జీమూతవాహనుణ్ణి విడిచి ప్రక్కకు తప్పుకొన్నాడు. తానుచేసిన పనికి పశ్చాతాపపడుతూ శంఖచూడుని వలన జరిగిన కధంతా సాంతంగా విన్నాడు. కాని ఏమి లాభం? జీమూతవాహనుడి శరీరంలో సగం అప్పుడే అతను కడుపులో జీర్ణించుకుపోయింది.
       రక్తసిక్తమైన శరీరంతో చావసిధ్దమై కొనౌఉపిరితో ఉన్న జీమూతవాహనుణ్ణి చూచి తల్లి దండ్రులు, అత్తమామలు, భార్య అందరూ గోలుగోలున ఏడ్చి, మొత్తుకొని, మూర్చిల్లేరు. "ఏ దేవతలకైనా దయరాదా! నా కొడు