పుట:Naganadham.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ లోగా జీమూతవాహనుడి కోసం అత్తమామలు, బావమరుదులు, భార్య, తల్లిదండ్రులు అందరూ వెతుక్కుంటున్నారు. అతిడింకా ఇంటికి రాలేదేమని వారంతా ఆందోళన పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశం మీదనుండి ఎగురుతొన్న గరుడుని నోటిలో ఎరగాఉన్న జీమూతవాహనుడి చూడామణి జారి క్రిందపడింది. అది అతని తల్లికే దొరికింది. మరేముంది? చూదగానే ఆమె దానిని పోల్చిపట్టి తన కొడుకు కేదో విపత్తు వచ్చిందని భావించి గోలపెట్టి ఏడ్ఫసాగింది. అంతాకలిసి జీమూతవాహనుడుఇ విడిసిన సముద్రతీరానికి నడేచేరు.

అంతలో అక్కదికి శంఖఛూడుడు వచ్చాడు. అతడు కూద విలపిస్తున్నాడు. "ఈరోజున నాకు బదులుగా ఎవరో పుణ్యాత్ముడు తన ప్రాణాలు బలియిచ్చాడు. నా మెడకి అకారణంగా పాపం చుట్టుకుంది." అని ఏడుస్తూ అతడు తన కధ అంతా ఈ రాజపరివారానికి విన్నవించాడు. వారివలన ఆ పరోపకారపారాయణుడు జీమూతవాహనుడనిన్నీ వీరంతా అతని ఆత్మీయులని తెలుసుకొన్నాడు. గరుడుని కెరయైజీమూతవాహనుడు హతుడయ్యెడని భావించి, అతని తల్లిదండ్రులు శోకావేశంతో మూర్చాగ్రస్తులయ్యారు. మలయవతి భర్త గారి చూడామణి అందిపుచ్చుకొని చితిపేర్చుకొని చనిపోవడానికి ఉద్యుక్తురాలయింది. శంఖచూడుడి కిదంతాచూచి కడుపు తరుగుకొనిపోయినంత దు:ఖమయింది. అయినా