పుట:Naganadham.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రశ్నలు వేసుకోంటూన్నంతలో, ఆ దేవాలయంలోనుంచి అతి మధురమైన వీణాగానం వారికి వినిపించింది. వారిచెవుల కెంతో ఆనందమైంది. కాని ఆశ్చర్యం మరింత హెచ్చయింది. అదేదో దగ్గరగాపోయి చూడాలనే కుతూహలం వారిని మరింత త్వరపెట్టింది. ఇద్దరూ గబ గబా దేవాలయ ప్రాంగణంలోకి త్రోవదీసారు. ముఖమంటపం దాటారు. ముందుకు పోయి తొంగిచూసేరు. వాళ్ళకి తెలియకుండానే వళ్ళక్కడ ఆగిపోయి కన్ను రెప్పవెయ్యకుండా అలా చూస్తూ నిల్చిపోయారు.

అక్కడ ఒక దివ్యసుందర విగ్రహమైన విద్యాధర సుందరి వీణవాయించి దేవిని ప్రార్థిస్తూ పాదుతూంది. ఆమె ప్రక్కనే ఆమె చెలికత్తె పూజాద్రవ్యాలు గల పళ్ళెం, పన్నెరు బుడ్డి, గంధపుగిన్నె, పూల దండలు వగైరాలు పట్టుకొని కూర్చొంది. ఎదుట జగన్మాత పార్వతి విగ్రహం అభయముద్ర పట్టి, చిరునవ్వుతో, షోడశ కళాపరిపూర్ణంగా విరాజిల్లుతూంది.

"ఈ కన్య ఎవరు? ఈఅడవిలొ యిలా మందిగమెందుకుంది? ఈమె ఏ కోరికతో యీ దేవినిలా ఆరాధిస్తూంది? ఇంతకీ యీమెతో మాట్లాడి పరిచయం చేసుకొనే అవకాశం మనకెలా కలుగుతుంది?" అని జీమూతవాహనుడు తన మనస్సులో ఎన్నో గుత్తులు గుత్తులుగా ప్రశ్నలు వేసుకొంటున్నాడు. ఆత్రేయుడు కూడా అదే విధంగా ఆలోచిస్తు