Jump to content

పుట:Naganadham.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెల్లీ, యీ కథ వింటే కలిబాధ లుండవు. నల దమయంతులనీ, నాగరాజైన కర్కోటకుణ్ణీ, రాజర్షి అయిన ఋతుపర్ణుణ్ణీ తలచుకొంటే సమస్తమైన కలి కల్మషాలు అతరించి పోతాయి. సకల సంపదలూ కలుగుతాయి. ఇది జ్ఞాపక ముంచుకొని రోజూ స్మరిస్తావు కదూ! శుభం.