పుట:Naganadham.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

25

తల్లిదండ్రుల వద్దఅనుమతి గ్రహించి దమయంతి వంటశాలలో ఉన్నబాహుకుని వద్దకు నెల్లింది. తన అపరాధం మన్నించమని అతని కాళ్ళమిద పడింది. ఆతిన్ని రప్పించడానికే తానీ ఊహ పన్నినానని చెప్పి తద్వారాఅతనికి కష్టం కలిగించినందుకు క్షమాపణ వేడుకుంది.

నలుడు కర్కో-టకుని స్మరించాడు. వెంటనే అతని అంగవస్త్రం అతని భుజంపై వచ్చి పడింది. మరుగుజ్జ రూపు మాయమయి, దివ్యసుందరమైన అతని పూర్వపు రూపు ఆయనకు వచ్చింది. దమయంతిని లాలించి, ఆదరించి, పిల్ల లిద్దరినీ ఎత్తుకొని, అ త్తమామలవద్ద కేగి, వారికి నమస్కరించాడు నలుడు. బాహుకుడే నలుడని వినగానే ఋతుపర్ణుడు ఎక్కడ లేని ఆనందాన్ని పొందాడు. ఆ దంపతు లిద్దరినీ ఆశీర్వదించి, వారివలన కృతజ్ఞతలు, మన్ననలు పొంది, అతడా మరునాడు గ్రన తననగరానికి పయనమయ్యాడు.

కొన్నాళ్లు అ_త్తమామలవద్ద ఉండి, నలుడు తిరిగి నిషధపురానికి వెళ్లాడు. నలుగు వచ్చాడని తెలియగానే పుష్కరుడు భయపడ్డాడు. తిరిగి జూదమాడి నలుడు తాను ముందు ఓడిపోయిన రాజ్యమంతా మళ్లా గెల్చుకున్నాడు. పుష్కరుని క్షమించి విడిచిపెట్టాడు. భార్యా పిల్లలను విదర్భ నుండి తెప్పించుకొని సుఖంగా నలుడు చిరకాలం రాజ్యం చేశాడు. అతని రాజ్యంలో మరెన్నడూ కలిభాధలు లేవు.