పుట:Naganadham.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 నాగానందం

పడి నిల్చిపోయెవి. మదించిన ఏనుగుల గుంపు ఆమెవ్ కదురుగావచ్చి ప్రక్కకు తప్పుకొని వెళ్లిపోయింది. ఇదంతాచూచి దమయంతి 'భగవంతుడు నెనిలా దు:ఖిస్తూ బ్రతకాలనే కోరుకున్నాడు కాబోలు ' అనుకొంది.

               అడవి దాటిన పిదప దమయంతికి కొందరు బిడారు వర్తకులు కనిపించారు. వారిసహాయంతో ఆమె చేదినగరం చేరుకుంది. ఆ నగరానికి రాజు సుబాహుడు. అతని భార్య దమయంతికి సాక్షాత్తు పినతల్లి, అయితేమి, మాసిన తలా, చిరిగిన చీరతో ఉన్న దమయంతిని ఎవరు పోల్చుకోగలరు? అదృష్ట వశాత్తు రాణిగారి దృష్టి వీధిలో పోతున్న దమయంతిపై బడింది. ఆమె దాసీలను పంపి దమయంతిని తన అంతఃపురానికి పిలిపించింది. 

రూపురేఖా విశేషాలవల్ల దమయంతి ఉత్తమ కులీను రాలనీ, కాలనైపరీత్యంచేత ఏదో కష్టంలోఉండి ఉదాశీనంగా ఉన్నాదనీ, దమయంతిని చూడగానే రాణి గురించింది. "అమ్మా నీవవరు? కష్టంలో, మసిలోఉన్న మాణిక్యం వలె కనిపిస్తున్నావు. నిన్నుచూస్తే నాకు పుత్రనాత్సల్యం కలుగుతూంది. తప్ప లేకపోతే సీసంగతి చెప్ప. నాకు వీలయిన నీకు సహాయంచేస్తాను. లేదంటే మాయింట్లో మాఅమ్మాయి సునందతోపాటు సుఖంగా ఉండు" అని రాణి అతి ఆప్యాయంగా ఆదరించిపలికింది. దమయంతి కొన్నాళ్ళక్కడ ఉండటానికి అంగీకరించింది. కాని తానెవరో మాత్రం చెప్పలేదు,చెప్తే నలునిగూర్చికూడ చెప్పవలసివస్తుంది.