పుట:Naganadham.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నలోదయం 19

అక్కడ దమయంతి నిద్రనుండి మేల్కొని, నలుడు కానరాకపోయేసరికి గాభరాపడింది. అటూ ఇటూ చూచి వెదకి వేసారింది. దిగులుపడి పదేపదే పిలిచింది. కస్నేరు మస్నేరుగా కార్చి వలవల విలపించింది. తన్ను తానెరుగని దుఃఖావస్థలోపడి మూర్ఛిల్లింది.

మూర్చలో మునిగి తేలినంతలోగా ఆ మహాపతివ్రతకి మరికొన్ని పాట్లు వచ్చాయి. ఒక కొండచిలువ ఆమెనుపట్టి మ్రింగబోయింది. అప్పడే మూర్ఛనుండి తెప్పిరిల్లిన దమయంతి పామునుచూచి భయపడి ఆర్తనాదం చేసింది. దైవికంగా ఒక గోయవాడా త్రోవనుపోతూ దమయంతి విలాపాన్ని విని, తటాలున వచ్చి, కొండచిలువను చంపి, ఆమెను రక్షించాడు. అయితేనేమి, వాడు ఆ పాముకంటె ఎక్కువ దుర్మార్గుడు. దమయంతి రూపలావణ్యాలు చూచి వాండామెను మోహించాడు. తన్ను పెళ్లాడవలసిందని ఆమెను బలవంత పెట్టసాగాడు. దమయంతి వాని కెన్నో బుద్ధులు చెప్పింది. ఎంతగానో బోధించింది. ఎంతైనా దీనంగా విలపించి ప్రార్థించింది. వాడు వినలేదు. దమయంతి కోపగించుకుంది. ఆమె మహాపతివ్రత ఆమె గుడ్లెర్రచేసేసరికి వాటినుండి అగ్నిజ్వాలలు బయలు వెడలేయి. బోయవాడా అగ్నిలోబడి నిలువనా బూడిదయ్యాడు.

          ఈ విపత్తు గడచిన పిదప దమయంతి, నలుని వెదకుతూ, గోలు గోలున ఏడుస్తూ ఆ అడనియంతా తిరిగింది. సింహాలు, పులులుకూడ వచ్చి ఆమె దీనావస్థనుచూచి జాలి