పుట:Naganadham.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిచ్చులోనుంచి వెలికి తీసేడు. బయటపడడమే తడవుగా ఆ పాము నలుని బొటన వెలిమీద గట్టిగాకాటువేసింది. నలుడీ కృతఘ్నతకి నివ్వెరపోయాడు. "మహారాజా, నన్ను నిందించకు, నేను నిన్ను కరవాలనే కరిచాను. నా పేరు కర్కోటకుడు. ఈ నా"కాటువల్ల నీరూపు మారిపోతుంది. ఈ కష్టకాలంలో మారురూపంతో నువ్వు ఎక్కడైనా ఉండి కాలం గడపవచ్చు. తిరిగి మంచిరోజు వచ్చాక, నన్ను తలచుకొంటే నీపూర్వ రూపం నీకు వస్తుంది. లోగడ నీపై మీద బట్టను పక్షులు ఎత్తుకుపోయాయి కదూ. అదికూడ నీకు తిరిగి లభిస్తుంది. నువ్వు తిన్నగా అయోధ్యకి పో. అక్కడ ఋతుపర్ణుడడనే రాజు పరమ ధార్మికుడు రాజ్యంచేస్తున్నాడు. నీకతనివద్ద ఆశ్రయం దొరుకుతుంది. నీకు శుభమౌతుంది. మరి శెలవు" అని చెప్పి ఆ పాము మాయమయింది. నలుడు నల్లగా మాడిపోయి, పొట్టిగా మరుగుజ్జగా మారిపోయాడు.

కర్కోటకుడు చెప్పినమాటప్రకారం నలుడు ఋతుపష్టని వద్దకి చేరుకొన్నాడు. తన పేరు బాహుకుడని చెప్పకున్నాడు. వంట చెయ్యడంలో నేర్పరినని విన్నవించుకొన్నాడు, అవసరమైతే రధసారధ్యం కూడ చేయకలనని చెప్పాడు. రాజుకి ఇతని మాటలు నచ్చాయి. వెంటనే తమదివాణంలో వంటవానిగా బాహుకుని నియమించాడు. 'బ్రతికి ఉంటే బలుసుఆకు ' అనే సామెతగా నలుడక్క_డ అజ్ఞాతంగా కాలంగడపసాగేడు.