పుట:Naganadham.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వచ్చిన ఫలాన్నికూడ మాయచేసి తన్నుకుపోయాడు. అంటేది అంటకుండా ముట్టేది ముట్టకుండా చేసి ముప్పు తిప్పలాపెట్టడమే కలిగారి విలాసం.

  పాపం, ఆకలితో అలసి, సొలసి దమయంతి నిద్రపోయింది.  అలా కటిక నేలమీద  పడుకొని నిద్రిస్తున్న మహా రాణిని చూచి నలుని మనస్సు మరీ వికల మయింది.  "ఈ నిద్రిస్తూన్న సమయంలో ఇక్కద యీమనువిడచి నేనెక్కడకైనా పోతే బాగుండూ? నేను కానరాకపోతే యీమె బుద్ధి మళ్లించుకొని పుట్టింటికిపోయి సుఖపడుతుందిగదా!" అనుకున్నాడు నలుడు.  కాని ఎలా వెళ్ళడం. కాళ్లురాలేదు. చాచసేపు తతపటాయించాడు. 'తనకోసం బెంగపెట్టుకొని చచ్చిపోతుందేమో ' అని భయపడ్డాడు.  "ఆమెను కాపాడవలసిందని దేవతలందరినీ ప్రార్ధించాడు. ఆమె కట్టుకున్న చీరలో ఒక ముక్క చింపి తన కంగవస్త్రంగా పుచ్చుకొన్నాను. గుండె రాయిచేస్కొని, గ్రుడ్లనీరు నింపుకొని, కనిపిస్తూన్నంత వరకు వెనక్కి మళ్ళిచూస్తూ, వెళ్ళినవాడు రెండు మూడు సార్లు తిరిగివచ్చి, చూచి చివరికి తెగించి ఆమె నా అడవిలో వదిలి నలుడెక్కడికో పోదామని బయల్దేరి వెళ్లిపోయాడు.
   కొంతదూరం పోయేసరికి అతని కా అడవిలో కార్చిచ్చు మధ్య చిక్కుకొని 'సాహిసాహి ' అని అరుస్తూన్న పాము ఒకటి కనిపించింది.  పరోపకార పరాయణుడు, ఆర్త్రత్రాణ బిరుదాంకితుడు అయిన నలుడు తటాలున ఆ పామును