పుట:Naganadham.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విన్నావా చెల్లీ, పైమీద బట్ట పక్షులు ఎత్తుకుపోయే కష్టపు రోజులనే సామెత ఎరుగవూ? అది యీనలమహారాజు కధతోటే పుట్టింది.

          నలుడు ఏకవస్త్రుడై, పక్షులమీద, బట్టమీద ఆశవిడచి నీరైనా దొరుకుతుందేమొనని నాల్గు ప్రక్కలాచూచాడు.  అడవిలో నీరక్కడ! అదికూడ దొరకలేదు.  మొగం తేలవేసి దమయంతి దగ్గరకు వచ్చాడు.  ఇద్దరూ ఒకరి అవస్థచూచి మరొకరు విచారపడ్దారు.  దేవతలకికూడ వాది దీనస్థితి చూచి జాలికలిగింది.  అమృతభరితమైన ఒక ఫలాన్ని వారిముందు పడవేసారు.  అకస్మాత్తుగా ఆకసంనుండి పడిన పండుచూచి నలుడు బ్రహ్మానంద భరితుడయ్యాడు.  దమయంతికిచ్చి తినమన్నాడు.  ఆమె దీనిని మీరే తినండని తియ్యారించింది.  ఒకరి నొకరు బ్రతిమాలుకోసాగారు. ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు హఠాత్తుగా అక్కదికి వచ్చాడు. "అయ్యో, ఆకలి, దాహం, ఎవరక్కడ? నాకింత ఆహారం పెట్టకపొతే బ్రహ్మహత్య వారి మడకు చుట్టుకొంటుంది" అని అరస్తూ ఆ దంపతుల ముందు మూర్చపడ్డాడు.  సహజంగా ఉదారులు, దానశీలురు, పరమ దు:ఖదు:ఖితులు అయిన ఆ రాజదంపతులు తమకని దేవతలు పంపిన ఆ అమృత ఫలాన్ని చావగూర్చున్న బ్రాహ్మణుని కిచ్చి 'అతిధి దేవొభవ ' అనుకున్నారు.  ఆ పండుతిని, త్రేన్చి బొజ్జ నుమురుకుంటూ తనత్రోవను పోయాడా బ్రాహ్మడు.  ఆ బ్రాహ్మణు డెవరో తెలునా? కలి. వారినోటిదగ్గరకి