పుట:Naganadham.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దమయంతినిచూచి గుండె చెరువైపోయింది. "ప్రియురాలా, నీవెందుకీ కష్టాలుకొని తెచ్చుకుంటావు? హాయిగా పుట్టింటికి పోతే సకల సౌఖ్యాలు అనుభవించవచ్చు, ఈ కష్టాలు కాపురముండవు., నేను తిరిగి మంచిరోజులు రాగానే నిన్ను కులుకొంటాను. నామాటవిని నువ్వు మీ తల్లి దండ్రుల వద్దకి వెళ్లిపో, అలాచేసి నన్ను సంతోషపెట్టు" అని నలుడు దమయంతి వెంతగానో బ్రతిమాలాడు. కాని ఆమెవినలేదు. "మీరక్కడుంటే అక్కడే నాకు సుఖం. మిమ్మల్ని విడిచి వుంటే స్వర్గంకూడ నాకు నరకతుల్యమే. అదికాక మీ ధర్మపత్నినయిన నేను మీతోబాటు కష్టసుఖాలు పంచుకో అనుభవిస్తాను కాని ఒంటరిగా అనుభవించ గలనా? మరి ఒక్క క్షణమైనా నేనుండలేను" అని ఆమె కంటతడి పెట్టుకొని చెప్పింది.

    పగలు రెండు ఝాముల వేళ అయింది. నలునికీ దమయంతికీకూడ ఆకలి ఎక్కువగా అవుతూంది.  ఏదైనా వేటాడి తెద్దామని బయల్దేరాడు నలుడు. ఇతని కోసమే వచ్చాయా అన్నటులు సమీపంలోనే వచ్చి వ్రాలాయి కొన్ని పావురా పిట్టలు. నలునిచేతిలో ఏముంది? వలలేదు.  కర్రలేదు కత్తిలేదు ఏమీలేదు. పైమీదనున్న అంగవస్త్రాన్ని వాటిమీద విసిరాడు.  పక్షులు దొరకలేదు. సరికదా, అవి ఆ అంగవస్త్రాన్ని లంకించుకొని ఆకాశానికి ఎగిరిపోయాయి.