పుట:Naganadham.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జయమాల గొని, దమయంతి సభామండపంలో గల రాజుల కీర్తి ప్రతిష్టలు, గుణాఖ్యానాలు వింటూంది. ఒకొక్క_రినే విడిచి ముందుకు పోతూంది. నలు డెక్కడున్నాడనే చూపు మధ్య మధ్య ఆమె కన్నులలో తళుక్కుమంటూంది.

సరస్వతి దమయంతికి నలుని చూపెట్టింది. "ఇతడు నిషధేశ్వరుడైన వీరసేనుని కుమారుడు. పదునెన్మిది ద్వీపా లకి పట్టపురాజు, తనకీర్తి ప్రతాపాలు దశదిశలా నింపిన మహారాజు. సామంతుల మెప్పలంది సమస్న రాజకులానికి వన్నె తెచ్చిన చక్రవర్తి. అందక తైలందరూ ఏరికోరి వరించ దలుస్తూన్న నలమహారాజు యిూ అందకాడే" అని చెప్పింది. దమయంతి ముఖం హర్షోత్సాహలతో వికసించింది. చేతిలో ఉన్న జయమాల అప్రయత్నంగా విూదికిలేచింది. నలుని మెడలో పూలదండ పడబోతూందన్నంతలోసరస్వతి "సఖీ,  కాదు కాదు" అంది. 'సలుడితడు "కాడు. అడుగో ఆయన"  ప్రక్కనే కూర్చున్న మరో నలుణ్ణి చూపింది. తిరిగి ఉ ఊ ఆప్రక్క నున్నవాడే నలుడు" అన్నాది. "కాదు కాదు,అ రే! ఇదేమిటీ మాయ!! ఇక్కడ అయిదుగురు నలుళ్లున్నారే! సుందరీ ఇకనీయిష్టం. ఇందులో ఎవరు నలుడో, ఎవరు కారో, నాకే తెలియకుండాఉంది. అని నివ్వెరపడి ఊరుకుంది.. 

దమయంతికీ రహస్యం విదితమయింది. దిక్పాలకులు నలుగురూ నలుని వేషంతో వచ్చి కూర్చొన్నారని గ్రహించింది. వెంటనే వారినిలా ప్రార్ధించింది. "దేవతలారా, మీ