పుట:Naayakuraalu.Play.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

97

నల. రా : సరే, నీయిష్టం వచ్చినట్టుకానియ్యి. నాగమ్మగారూ, నాయకుడికి తాంబూలమియ్యండి. నాయకుడా, సంగతులెప్పటివప్పుడు కామకా తెలియపరుస్తూవుండు.

చెంచ : రోజూ అంచె నడిపిస్తా. దండాలు సామీ !

నల. రా: వెళ్లు.

[ నిష్క్రమణం - తెరపడుతుంది ]

3-వ రంగము

మండాదిలో మలిదేవరాజుగారి యిల్లు

[ మ. దే. రా. బ్రహ్మ. సభికులు ప్రవేశము ]

బ్రహ్మ : మహాప్రభూ, సభాసదులారా, మనము పల్నాటిని విడిచి పరదేశాల పాలయినప్పటినుంచీ మన ఆవుల మందలను కంటికి రెప్పగా కాచి మస శిబిరానికంతకూ జీవనం జరుపుతున్న లంకన్న వీరస్వర్గం బొందాడు.

మ. దే. రా : ఏమి ఆశ్చర్యం ! ఎవరు చంపారు ?

బ్రహ్మ : ఆ వీరుని మరణచరిత్రను కన్నమదాసువలన సావకాశంగా వినగోరుతున్నాను.

మ. దే. రా : కన్నమబాసూ, తూచాలుపోకుండా వీరచరిత్రను వినిపించగోరుతున్నాను.

క. దా : మహాప్రభూ ! మనము మండాది ప్రవేశించినప్పటి నుంచి మనకు పడమరా, దక్షిణానా పెచ్చు బెరిగివున్న అడవులలో సంచరించి, లేబచ్చికలు మేసి, చెలమలలో నీళ్లుదాగి మనమందలు పెంపొందుతూ వచ్చినవి.