పుట:Naayakuraalu.Play.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

నాయకురాలు

నల. రా : ఏమి పనిమీద వచ్చావు ? భయపడక చెప్పు ; మీ గూడెమంతా సుఖంగా వున్నా దా?

చెంచు : మా గూడేనికి వండవచ్చింది సామీ. మేము భూమి మీద నిల్చేకోపులేదు. మా కందరికీ పోదెరువులు వచ్చినవి. మా చుట్టుపట్ల నాలుగామడలదాకా కీకారణ్యంగా వున్న అడవులన్నీ మారణమయిపోయినవి. చెట్లన్నీ కొట్టారు. ఒక బచ్చెనకఱ్ఱ చేసుకొనడానికి పుల్లదొరకడం లేదు. పశువు నోటగరవడానికి గడ్డిపోచలేదు. ఎక్కడజూసినా బెమ్మనాయుడుగారి ఆవులు దిక్కుల కెగబాకి మేస్తున్నవి. ఎక్కడ జూచినా వారి తొఱ్ఱుపట్లే

నల. రా : మీ రెక్కడికయినా లేచిపోమంటారా?

చెంచు : మేము యాడికి లేచిపోతాము సామీ ? గడ్డపుట్టగా పుట్టినవాండ్లం.

నాయ : నాయకుడా, యిప్పు డేమి చేస్తా నంటావు ?

చెంచు : నీవు దేవతవు. మనిషయిపుట్టి భూమి పాలిస్తున్నావు. నీవు తల వూచావాఅంటే పుంజులమూ, పెట్టలమూ పోగై లంకన్ననూ, ఆవులనూ తెల్లవారేవరకు సోదిలోకి రాకుండా కొడతాం.

నల. రా : గోపాలకులను కొట్టగలరుగాని సైన్యాన్ని మీరు ఎదిరించగలరా?

చెంచు : వాండ్ల సైన్యాలు మమ్ము నేమీ చేయలేవు. చెట్టు కొకండ్లం చెదిరిపోయి అంబులు కురిపిస్తాం. గొడ్లుగాసే వాండ్లనుమాత్రం అడవిలో అడుగుబెట్టనియ్యం. వారం రోజులలో మందను మాటివేస్తాం. గెలుచుకున్న ఆవులలో సగం ఏలినవారికి కానుకయిస్తా. సగం నా కిప్పించ్చండి.