పుట:Naayakuraalu.Play.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

89

బ్రహ్మ : ఈ యేడుసంవత్సరములూ యెవ రెన్ని బాధలు పెట్టినా సహించి సమయం నెరవేర్చినట్లైతే శత్రువుల హృదయం మారిపోయి ఉభయులకూ శత్రుభావం నశించి మిత్రభావమే కలుగవచ్చు. కలుగకపోతే రణం నిశ్చయం.

బా. చం : నా నిశ్చితాభిప్రాయ మిది. గడు వయినతరువాత వారు మీకు రాజ్య మెటూ యియ్యరు. అప్పుడు మీరు యుద్ధంజేసి గెలవడం వట్టిమాట. యేడుసంవత్సరములూ బాధలుపడి తరువాత చావడంకంటె జయమో, మరణమో యిప్పుడే తేల్చుకోవడం మంచిది.

బ్రహ్మ : మనకు ఇప్పుడో అప్పుడో మరణమే నిశ్చయమైన యెడల మన మిచ్చినమాట చెల్లించి తరువాత మనకు న్యాయంగా రావలసినదానికోసం పోరి వీరస్వర్గమందడం మేలు.

మ. దే. రా : గురువుగారు నిశ్చయించినదే జావైన దారి. దానిని మనమందరం శిరసావహించవలసినది.

కొమ్మ : తథాస్తు,

అందరు : తథాస్తు .

బ్రహ్మ: కొమ్మరాజుగారూ, వారి కొమారుడూ మనతో వనవాసం జేయవలసిన ప్రసక్తిలేదు. గురిజాలకు వెళ్లడమే ఉత్తమమని నాకు తోస్తున్నది.

కొమ్మ : సుఖకాలములో మీ ఆశ్రయమును బొంది, కష్టకాలములో వైదొలగడం నాకు సమ్మతంగాదు.

అ. రా : ఉత్తమమయిన జవాబు. బ్రహ్మ : ఇక మనము వెళ్లవలసిన స్థలము నిర్దేశం చేయవలసి వున్నది.