పుట:Naayakuraalu.Play.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii

రాజునకు దొడ్డనాయుఁ డను నతఁడు వెలమ మంత్రిగా నుండెను. ఆయనకుమారులలోనివాడే మన బ్రహ్మనాయుడు. (అనగా రెండవ కొడుకు) ఈ బ్రహ్మనాయుని అన్నయగు పెద్దన్నను (బాచరాజును) అనుగురాజు తనకు సంతానము కలుగకముందు కొన్నాళ్లదనుక స్వీకారపుత్రునిగ పరిగ్రహించి యుండుటచేత మన బ్రహ్మనాయునికి కేవల మనుశ్రుతముగావచ్చు మంత్రిసుతత్వముమాత్రమే కాకుండా, యువరాజత్వముకూడ కొంత ధర్మతః సంబద్ధమై వచ్చినది. కనుకనే పల్నాటినాయకుల కథాభాగములో బ్రహ్మనాయుడు ప్రతిచోటను ఎక్కుడు ప్రాముఖ్యమును ఆక్రమించుకొనుట మనకు గోచరమగుచు నుండును.

వీరుల యుద్ధకారణము

పైని చెప్పిన వివర మంతయును బ్రహ్మనాయుని ప్రధానత్వమును తోఁపింపచేయుటకై వ్రాసితిని. కాని ఇది మన కథాంశము గాదు. ఇక ప్రస్తుతమునకు వత్తము. అనుగురాజు పల్నాటిని పాలించి మృతినొందినతర్వాత నలగామరాజు పట్టాభిషిక్తుడైనాడు. నలగామరాజు రాజ్యపాలనము వహించిన కొన్నాళ్ళకు దొడ్డనాయకుడు (బ్రహ్మనాయుని తండ్రి) కూడ ఆదారినే పట్టుట గలిగినది. ఇట్టి స్థితిలో నలగామరాజునొద్ద పరంపరాప్రాప్తమగు మంత్రిత్వమును దొడ్డనాయునితర్వాత బ్రహ్మనాయుడే పూనవలసియున్నను, మఱి యొకరీత్యా నాయకురాలు (ఈమెయే యీ నాటకములోని నాయకురాలు) ఆ పదవిని ఆక్రమించుకొనుట గల్గినది. అయినను బ్రహ్మనాయుడు మంచి మేధావియును, కార్యచతురుడును, ప్రభుభక్తిధురంధరుడును, సత్యనిరతుడును, నిక్కమగు దేశభక్తిచే సంభరితుడును అగుటచేత నీ యకార్యమునకు కుపితుడుగాక, నలగామరాజుయొక్క తక్కిన యార్వురు సోదరులను పెద్దవారలగునంతవఱకు పెంచుచు కాలమును ప్రతిక్షించియుండి, తనకు పదచ్యుతి కల్గినను, అనాదినుండివచ్చుచున్న ప్రభువంశమునందలి భక్తిచే అనురాగమునే ప్రదర్శించుచు, ఆ పిల్లలు పెద్దవారలైన వెనుక తాను మాచర్ల