పుట:Naayakuraalu.Play.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

నాయకురాలు

అ. రా : ఇంకొక విధంగా అవుతుందని నేననుకో లేదు. మొదట జెపితే వినకపోయినారు. యిప్పటికయినా యేదో విధంగా రాజీగా ఫయిసల్ చేసుకోండి..

నాయ : మీరు జెప్పే రాజీమాట అంతా బతికి బాగుంటే, యేడుసంవత్సరాలు ముగిసినతరువాత ఆలోచింతాము. ఈ మధ్యగాదు.

మ. దే. రా : రాజ్యం వచ్చింది ; పోయింది.

బ్రహ్మ : మాచర్ల వెళ్లి బంధువులను తీసుకొని వెళ్లుతాం.

నల. గా ; మూడురోజులు గడువు, తరువాత ఒక్క నిమిషం. వుండవద్దు.

[ బ్రహ్మనాయుడు మొదలగువారు నిష్క్రమణం, తెరపడుతుంది ]