పుట:Naayakuraalu.Play.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

నాయకురాలు

బ్రహ్మ : దూరపుచూపు మంచిదేగాని తమకు అనుమాన మెక్కువ.

కొమ్మ : మనము చెడతాం.

బ్రహ్మ : నమ్మక చెడడంకంటే నమ్మి చెడడం మంచిది.

అ. రా : ఎట్లాజెడ్డా పర్యవసానం వొకటే.

[ ఒక సుద్దులవాడు. ప్రవేశము ]

పాట

బు. క : పల్నాటిమిద్దెలకు - వాసాలులేవు
          కొండవీటిబ్రాహ్మలకు - మీసాలులేవు
          మాచర్లకోళ్లకు - రోసాలులేవో - తంధాన

[ వెళ్లిపోతాడు ]

బా, చం : ఎవడురావాడు ? చూపిస్తాం వుండు, మాచర్ల కోళ్లకు రోసాలు వున్నదీ, లేనిది.

నర : మీరూ చూతురుగాని. క. దా : అవును, వుభయులము చూస్తాం. తినబోతూ రుచడగడ మెందుకు?

[ సుద్దులవాడు తిరిగి ప్రవేశము ]

బు. క : మాచర్లదొరలకు - వేసాలులేవు
          అజ్ఞానచేష్టలకు - దోసాలులేవు
          పల్నాటిరెడ్లకు - మీసాలులేవో - తంధాన.

[ వెళ్లిపోతాడు ]

కేతు : అవురా ! బ్రహ్మనాయుడు నీచేత యిట్లా కూయిస్తున్నాడా ? పల్నాటిరెడ్లకు మీసాలులేవుగా ? .