పుట:Naayakuraalu.Play.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

77

యితరదేశాలవారు యెవరూ వచ్చినట్టులేదే? యేమి చేతామంటారు?

బ్రహ్మ: వాండ్లకు దీనియందు శ్రద్ధతక్కువ. వచ్చిన మనమే కానిత్తాము.

నాయ : ఇతరదేశాలదాకా యెందుకు, మాకున్నదీ మీకున్నశ్రద్ధ?

బ్రహ్మ: బయటివాండ్లకు సకాలంలో తెలిసినట్టులేదు. రెండునెలలయినా ముందుగా ఆహ్వానా లందితే, వెసులుబాటు చూసుకోని వస్తారు.

నాయ: దీనియందు రుచికలిగిందాకానే తరువాత వద్దన్నా వూరుకోరు. కొంతకాలం దీనిభారం మీమీద బెట్టుకొని జరపండి.

బ్రహ : అట్లాగే. వచ్చేసంవత్సరం ఆహ్వానాల యేర్పాటంతా నే జేస్తాను. ఇక్కడే జరుపుదాం.

నాయ : యెక్కడ జరిపితేనేమి? మాచెర్లలో జరిపినా నా కిష్టమే ; అదిమాత్రము మనదిగాదా ?

[ రహస్యంగా ]

మ. దే. రా : చూచారా. ఈ ఆటలవల్ల యెట్లా స్నేహం గుదురుతున్నదో.

బ్రహ్మ : ఈ మాటే నేను నిన్నంటే కొమ్మరాజుగా రంగికరించారుగారు.

కొమ్మ : నాయుడుగారూ, తమరేమయినా చెప్పండి. ఆమె మాటలలో స్నేహమేమీ గనపడడం లేదు. మాచర్ల "మసదం” టున్నది.