పుట:Naayakuraalu.Play.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

75

3-వ రంగము

గురిజాలదగ్గర మైదానం

[ బాలుడు. కన్నమనీడు ప్రవేశము ]

[ కోళ్లపందెం తెరలోపల జరుగుతుంది ]

బాలుడు : నాన్నగారు వచ్చేవేళయింది. తాగడం ఆపివేయించు. కత్తులన్నీ చికిలిచేశారా?

కన్న : కత్తు లెందుకు? నా నెవిలి ఆరెదెబ్బతోనే నాయకురాలి పుంజులను పడుకోబెడుతుంది.

బా. చం: అటువంటి పనులు జెయ్యకు. వట్టిపందేలు గావు.

కన్న : వూరికే తమాషాకన్నా, ఇదుగోనోయి, ఇక కోళ్లకు దాణా వెయ్యకండి. కాస్త ఆకలితో వుంటేనేగాని రోష మెక్కదు. నీళ్లుబెట్టి వరుసగా పందిట్లో కట్టి వేయండి.

[ మలిదేవరాజు, బ్రహ్మనాయుడు ఇతరులు ప్రవేశము ]

బ్రహ్మ: బాలచంద్రా ! అంతా సిద్ధంగా వున్నదా ?

బా. చం: మనవాండ్రమంతా వచ్చాము. గురిజాలవారు ఇప్పుడే ఒకరొకరు చేరబారుతున్నారు. నరసింగరాజుగారు వచ్చారు. పై రాజ్యాలవాండ్ల పొళుకు వెక్కడా కనబడదు. అంతా చప్పగా వుందికాని యెక్కడా ఉత్సాహం కనబడదు.

బ్రహ్మ : ఆవైపుకల్లా నరసింగరాజే సర్దాగల మనిషి. కొంతవరకు రాజుగూడా నయమే. ఇక పై రాజ్యాల సంగతి చెప్పనే అవసరంలేదు.