పుట:Naayakuraalu.Play.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

71

నర : యుద్ధమేనా?

నాయ : ఈమధ్య గోగ్రహణాలూ, యుద్ధాలు జరుగకుంటే,

నర : రెండవభారతకథ నడుస్తుంది.

నాయ : పర్యవసానంమాత్రం భేదంగా వుంటుంది. కృష్ణు డిటుంటాడు. నేను కృష్ణపాత్రను ధరిస్తా.

నర : సరే, మనకు జయం నిశ్చయం.

[ లేస్తాడు ]

నాయ : కట్టబోతును గుప్తంగా స్వాధీనములో వుంచండి.

నర : పందేలయ్యేవరకూ కోణ్ణీ, వాణ్ణీ మాయింట్లోనే పదిలం జేసా.

నాయ : మీరూ మంత్రకట్టే అంటూవుండండి. బహుమతులు మాత్రం పుష్కలంగా యియ్యండి.

[ నరసింగరాజు నిష్క్రమణం ]

నాయ : [ స్వగతం ]

జూదరితనంగూడ అబ్బింది. ఇది రాజకీయజీవితం. కుట్రలు, కుతంత్రాలు, మారాముళ్లు, ఎన్నో చేయక తప్పదు. నిద్రలేదు, గుండె నిమ్మళంలేదు, కడుపులో చల్ల కదలకుండా దూడలను దువ్వుకుంటూ మానెడు విత్తులు చల్లి గోనెలు పండించుకుంటూ హాయిగా వుండకుండా లేనిపోని బెడద బెట్టుకుంటినేమా అని చివరకు విచారపడవలసివస్తుందేమో. అమాయికపు ఆవు పశువులు – రచ్చలలో రాటుదేలిన ఈ రాజకీయవేత్తలు -