పుట:Naayakuraalu.Play.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

నాయకురాలు

పందెములు జరుగబోతున్నవి. మేటిపందెగాండ్లందరూ పౌరుషముగల పుంజులనుదెచ్చి పందెములు జరిపి దేశములో పౌరుషమును పెంపొందింప గోరుతున్నాము. మానధనులయిన ప్రభువులును, సరదారులును 'కోడిపోరుకంటె గొప్పదిలేదయా' అనే ప్రమాణవాక్యమును సార్థకపరచ గోరుతున్నాము.

ఇట్లు

పల్నాటిప్రభువయిన నలగామరాజు

ఇది చాలునా?

నర : మనరాజు పల్నాటిప్రభువని సంతకముచేయడము ఎంతో సూచిస్తున్నది.

నాయ : పల్నాటికంతకు తనే ప్రభువునని అభిప్రాయము.

నర : అది కాదనేవారితో కలతకు మొద లన్నమాట.

నాయ : ఈ పందెమే అందుకాయె. సరే, ప్రకటనకు ప్రతులు తయారుచేయించి నలుదిక్కులకు పంపించు.

గు: చిత్తము.

[ వెళ్లుతాడు ]

నర : పందెమేమి బొడ్డుతారు ?

నాయ : ఓడినవారు తమ రాజ్యమును గెలిచినవారి కొప్పగించి పరదేశములకు వెళ్లిపోవడం.

నర: గడువువెళ్లినతరువాత ?

నాయ : తరువాతి సంగ తెవరెరుగుదురు ?