పుట:Naayakuraalu.Play.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

69

నాయ : ఎంత అతడు సిద్ధముగా వున్నా మనముగా సూచించబోతే అనుమానపడతాడు. మహాయావలమనిషి. ఏమరుపాటున వొప్పించాలె.

నర : సంక్రాంతి యిక పదిరోజు లున్నది. ఈ యేడు మన కోడిపందేలకు రాడేమో?

నాయ : అదంతా వట్టిది. సప్తా యేడులోకాలలో యెక్కడ కోడిపందెమని కాకికబురు వచ్చినా వెళ్లుతాడు. పోకుండా వుండలేడు. ఒక్క మాచర్లకే ఆహ్వానం పంపితే అనుమానిస్తాడు. చుట్టుపట్ల రాజ్యాల కన్నిటికీ ప్రకటన పంపుదాం. దూరపువూళ్ల వాండ్లకు ఆలస్యంగా పంపితే వాండ్లు రారు. ఇక మాచర్లవారూ మనమే హాజరవుతాము. రాజుగారి సంతకంతో ప్రకటన పంపితే బాగుంటుంది. ప్రకటనకు ముసాయిదా తయారుచేయండి. ఎవరురా అక్కడ?

నౌకరు : చిత్తం.

నాయ : వ్రాతపరికరాలు తెప్పించు.

[ గుమాస్తా ప్రవేశము ]

నాయ : వ్రాయి.

గు : చిత్తము.

నాయ : (చెప్పుతుంది.)

ఆహ్వానపత్రిక

ఈ యేడు సంక్రాంతి కనుముపండుగరోజున ఏటాజరిగే దానికంటె ఇనుమిక్కిలిగా గురిజాల మైదానములో కోడి