పుట:Naayakuraalu.Play.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

59

లందరు కులభేదములు పాటింపక సమభావముతో వర్తించవలసివున్నది. దయా సత్య శౌచములు ప్రతిమానవుడు అవలంబించవలయును. ఇవి వీరవైష్ణవమతముయొక్క ప్రధాన సిద్ధాంతములు.

బ్రాహ్మ : పంచమాది కులములతో సాహచర్యము అనర్థదాయకము కాదా?

బ్రహ్మ : అగ్రవర్ణముల వారికంటె పంచము లెక్కువ దుర్మార్గులు కారు. అందుచేత వారితో సాహచర్యమువలన యే అనర్థమును రాదు. ఆరోగ్యవిషయమున వారి అలవాట్లు కొన్ని సరియైనవి కావుగాని ఆ విషయమున వారిని బాగుచేయవలసిన భారము అగ్రవర్ణములమీదనే నిలచివున్నది. అసహ్యమునకోర్చి శిశువులను తల్లిదండ్రు లేవగింపక యేవిధముగ సాకుతారో అగ్రవర్ణముల వారందరూ శిశు ప్రాయులుగా వున్న పంచములను పుత్రప్రేమతో ప్రేమించి బాగుచేయడము ధర్మము. తల్లిదండ్రులకు శిశువు లెట్లు అస్పృశ్యులుగారో, పంచములూ అగ్రవర్ణములకు అస్పృశ్యులు గారు. వారిని ప్రేమించి బాగుచేయుట ఉభయులకూ తరణోపాయమే. మన హృదయముల యందు ప్రేమ వున్న యెడల వా రస్పృశ్యులు కావడమునకు మారుగా మన హృదయాలింగమునకే అర్హు లవుతారు. ప్రేమ లేకపోవడమే మన భేదములకు కారణము. పండితులు అందరియందూ సమదర్శనులే. విశ్వదృష్టి గల వాడికి తిరుపతికొండయొక్క ప్రతిరాతియందూ శ్రీ వేంకటేశ్వర్లే కనబడుతాడు. ఆత్మయొక్క విశ్వమయ