పుట:Naayakuraalu.Play.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

నాయకురాలు

బ్రాహ్మ : బ్రాహ్మలు, కోమట్లు పట్టుబట్టలతో ఆలయం నిండివున్నారు. ఇది సేవాకాలం.

క. దా : అయితే నే నేమీ జెయ్యను ? నిలువలేనే. నాన్నగారూ ! ఏమి మార్గం? నాకు పిచ్చెక్కుతున్నది.

బ్రహ్మ : ఆయన్నే పిలువు, వచ్చి దర్శన మియ్యమని,

కన : కేశవా ! తండ్రీ ! నిన్ను చూడంది నిలువలేను. చెన్నకేశవా!

అదుగో కేశవుడు. ఆకాశమంతా కేశవుడే భూమంతా కేశవుడే, నా వొళ్లంతా కేశవుడే. నా లోపలా కేశవుడే !

పాట

[ హిందుస్తాని ముఖారి ఆది తాళము]

      దర్శనమాయె - సం - దర్శనమాయె
      విశ్వ - రూపుని - దర్శనమాయె
            దర్శనమాయె - సందర్శనమాయె - వి ||
      కేశవాయని - కేక వేయగ
      ఏకరూపమున - లోకమంతటను
           దర్శనమాయె - వి||

బ్రహ్మ : ఆర్యులారా! భగవత్కృపవలన కన్నమదాసుకు భగవత్సాక్షాత్కారము గలిగినది. అతడు ధన్యుడు. మనము ఈ సమయముననే మన వీరవైష్ణవమతముయొక్క ధర్మములను లోకమునకు వెల్లడించి వాటిని ఆచరణలో బెట్టుటకు ప్రయత్నించాము.

శ్రీమన్నారాయణునియందు భక్తి గలిగి ఆయన కృపాతిశయముచేత మోక్షమును పొందగలరు. వీరవైష్ణవు