నాయకురాలు
55
పాట
[ శంకరాభరణం - చతుశ్రగతి - ఏక , ]
మాలకన్నడు - చాకలిచందడు - మంగలిమంచన్న
జట్టుగట్టుకొని - సేవ జేతురట - చెన్న కేశవులకు
కులకట్లిప్పుడు - వీరలందరు - కూలద్రోతురంట
మొదటవి జేసిన వారికంటెను - మొనగాం డ్లీరంట
బ్రహ్మనాయు డీ మాలగుంపులకు - పట్టుగొమ్మయంట
సేనల - బెట్టి పోరునంట
గుడిలో - కొట్టి దూరునంట
మనలను - నెట్టివేయునంట
సాములుమీరే - శ్రద్దదీసుకొని - సరిపెడుదురు రండి.
అర్చ : ఇవ్వేళ గుళ్లో మీ సేవేనా ?
రెడ్డి : ఇంకేమిసేవ స్వామీ ! అన్నీ అంతానికి వచ్చినవి. కలియుగం ముంచకవస్తున్నది.
అర్చ: ఆ గోలేమిటి?
రెడ్డి : ఇంకా మీకు తెలియదూ? మాలగుంపు వూరేగుతూ గుళ్ళోకి పోతున్నది.
అర్చ : అయ్యో ! అయ్యో ! మాలగుంపే ! వచ్చిపడుతున్నది.
మాదిగమల్లిగ - కుమ్మరితేర్కుడు - మంగలిమంచన్న
పాప మప్పుడే - కలియుగమంతట - పండిపోయెనటర
తోళ్ల గాబులో - దేవునిముంచి - తొలిచిపెడుదువటర
తోళ్లకంపుతో - చన్నకృష్ణుడికి - ధూపమేతువటర
ఆవము - బెట్టి కాల్తువటర
మాంసము - బెట్టి ప్రోతువటర