పుట:Naayakuraalu.Play.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

నాయకురాలు

పి. రె: మనము అన్నికులములవారూ సేనలో చేరే సౌకర్యాలు చేస్తే మంచిది.

బ్రహ్మ : మనకు ధర్మచ్యుతి లేకుండా ఇతరకులములు చేరితే సంతోషమే. సైనికులకోసం సనాతనధర్మ వాదులం కాజాలము. మతస్వాతంత్ర్యంకోసమేగదా గురిజాలనుండి విడిపోయివచ్చాము. మన మతధర్మాలను స్పష్టంగా లోకానికి వెల్లడించి ఆచరణలో పెట్టినప్పుడే మనకు బలము చేకూరుతుందిగాని ; చెప్పేది వొకటి, చేసేది మఱొకటిగా వున్నంతకాలం మనధర్మము నెవరూ పాటించరు. కన్నమ నాయుడి కొమార్తెను బాలచంద్రుడి కివ్వడము నిశ్చయమయింది. లగ్నమయిన వెంటనే చెన్న కేశవస్వామి సన్నిధిన గోష్ఠి జరిపించి చాపకూటి సంతర్పణ చేస్తారని చాటించవలసినది. దానికి తగిన ప్రచారకు లెవరు ?

బా. చం : నా స్నేహితులలో ప్రచారకులుగా వుండదగినవాం డ్లనేకులున్నారు. వారిలో బాపన అనపోతురాజు, వెలమ దోర్నీడు, చాకలి చందన్న , కుమ్మర తేర్కుడు, అగసాలి చందన్న, మంగలి మంచన్న ముఖ్యులు.

బ్రహ్మ : మిమ్ములను నా తోడిప్రచారకులుగా నియమించుతున్నాను. మన మందరమును భగవంతుని సేవకులము. మనలో అంతరములు లేవు.

పి. రె: రెడ్డిప్రచారకు లెవరూ దొరకరా ?

బ్రహ్మ : నీవుదప్ప రెడ్డిప్రచారకుడు మరొకడు దొరకడు. దొరికితే సంతోషమే. విచారించండి. సోదరులారా!

చా. చందన్న : అయ్యా ! తమరు ధర్మసంస్థాపనకొరకు అవతరించిన మహాపురుషులు. మే మందరమును తమ