పుట:Naayakuraalu.Play.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

51

పి. రె: మన బలాన్నిబట్టి వుంటుంది.

బా. చం: అది యిప్పుడే తేల్చుకుందాము.

పి. రె: ఇప్పుడు మనకు ప్రతిఘటించే బలమున్నదా ?

బ్రహ్మ : బుద్ధిపూర్వకంగా చేతులో వున్న రాజ్యం వదులుకొని నాగమ్మచేతికి పోదామంటారా ?

కొమ్మ : బ్రతికిన నాలుగురోజులయినా పౌరుషంతో జీవించాలె. రాజు క్షత్రియుడు. మంత్రి వెలమదొర. మీకు తగినరీతిగా వర్తించండి.

బా చం : వెలమలు కత్తికింద నలిగినవారుగాని కాడికింద నలిగినవారు గారు. నలగామరాజు కాడి మన మెడమీద మోపితే నాగమ్మ ఛో అనడం ఆరంభిస్తుంది.

పి. రె: బింకాలతో లాభం లేదు. కన్నడు : మాలకన్నడు జీవించివుండగా మాచర్లకు భయం లేదు. అవమానకరమయిన సంధి పనికిరాదు.

బా. చం: సంధికి యితరు లంగీకరించినా మే మంగీకరించము.

అనపోతు : సత్యం.

చాకలిచందన్న : మగసిరైన జవాబు చెప్పావు.

పాపన్న : మాచర్ల గురిజాలతో పోరడం పొటేలు కొండను ఢీకొన్నట్టే.

బహ్మ: ఇప్పుడు యుద్ధపుమాటల ప్రసక్తి లేదు. పాపన్న గారూ ! జవాబు యోచించి పంపిస్తాము.

పా: చిత్తము, సెలవు. ( నిష్క్రమిస్తాడు. )

బహ్మ: ఈ రాయబారంధర్మాన మన కర్తవ్యం స్పష్టంగా తేలింది. మనం సేనలను వృద్ధిచేసుకొనే పనిమీద వుండక తప్పదు.