పుట:Naayakuraalu.Play.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

49

పాపన్న : నాకు గలిగిన సందేహమును వెలిబుచ్చినాను.

బ్రహ్మ: ఎందుకు మీ కీ సందేహము గలిగినది ?

పాపన్న : ఇక్కడ ప్రభువు రాజనామధారుడో లేక రాజప్రతినిథో మాకు దెలియదు. రాజు బాలుడుగాబోలు. వారిపై అధికారముగల పాలకు లెవరు?

బ్రహ్మ: మేమే.

పాపన్న : మీ కీ యధికార మెవరిచ్చారు ?

బ్రహ్మ : రాజుగారే యిచ్చారు.

పాపన్న : బాలు డిస్తే చెల్లుతుందా ?

బ్రహ్మ : యువరాజుకోసము రాజ్యమును మేమే సంపాదించాము.

పాపన్న : అనగా మీరే హక్కుదారులు ?

బ్రహ్మ : రాజుగారిదే రాజ్యము.

పాపన్న : మీరు వారికి వ్రాసి యిచ్చారా ?

బ్రహ్మ : వ్రాసి యియ్యడ మెందుకు ? రాజ్యము వారిదే.

పాపన్న : రాయబారము మీతోనే జరుపుతాను. ఉత్తరము చదువుకొన్నారా?

బ్రహ్మ : చదివాను.

పాపన్న : ఏమి జవాబు ?

బ్రహ్మ : మా రాజ్యము మీ కిచ్చుటకు వీలులేదు.

కొమ్మ : ఉత్తరములో నేమున్నది ? బ్రహ్మ : ఏమున్నది ? దుండగపు మాటలు. నలగామరాజును మోసపుచ్చి మండలము తీసికొన్నామట. తిరిగి యిచ్చివేయడమో లేక వారికి సామంతులుగా వుండి పొలించు కోవడమో జరుపవలెనట.