పుట:Naayakuraalu.Play.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

37

వాడి కొంటెతనము. చిక్కకుండ పరుగెత్తాడు. సరె - తలచుకొన్నకొద్దీ విచారంతప్ప ఎంతసేపున్నా పోక తప్పదుకదా? ఇక నీవు ఇంటికి పో. రాజుగారు వచ్చే వేళవు తున్నది. పోయి కలుసుకొంటా.

రా : అమ్మా ! మూడుకాళ్ల ముసలిని. నన్నేమి జేసిపోతావే ? ఊరక పండ్లబిగువున మాట్లాడుతున్నాగాని, కాళ్లు నిలవబడడము లేదు. నీవు లేకపోతే ఇల్లు గబ్బగీమవుతుంది.

( అని కూలబడుతాడు. )

నా : ( మీద చేయివేసి ) ఏమే అయ్యా ! ఎట్లావున్నదీ? నీవు ధైర్యము విడిస్తే నాకు కాలుసాగదు. ఒకవేళ బలవంతంగా పోయినా నా మనస్సు నీమీదనే వుంటుంది. పోనీ రా వీలులేదని రాజుగారితో చెప్పివేస్తాను. నీకు కష్టమైనపని నా కెందుకు ? పోనీ నీవుకూడా రా.

రా: (చివ్వున లేచి) నీవు మహత్కార్యం చేయబోతుంటే ఈ ముదుసలి అడ్డమురావడంకూడానా? తక్షణం లేచి పద. నే నింట్లోవుండి ఈ కామాటమంతా చూచుకొంటా. వెనుకాలోచనవద్దు. (అని వెళ్లి నాడు)

[ తెరపడుతుంది. ]

5 - వ రంగము

[ వనము : నలగామరాజు, కేతురెడ్డి , నరసింగరాజు ప్రవేశింతురు. ]

నల: కేతురెడ్డి, చేతమీదుగా పోగొట్టుకొన్నా, సగము రాజ్యమూను. అప్పటి కేదో ముసించింది. ఆలోచించి చెప్పుతానన్నా పోయేదే. సర్దార్లంతా మలిదేవుడితో