పుట:Naayakuraalu.Play.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

21

పా : పిల్లలను చూడడానికయినా తేపా మాచర్లకు పోక తప్పదు. రెండు రాజ్యాలకూ విరోధాలు బలమయినవా అంటే, మధ్య సన్నవాండ్లం నలుగుతాం.

కా: చంద్రవంక యిక మనది కాదనుకోమా లేక నాగులేరు పగవాండ్లదని విడిచిపోదామా?

పా : ఈ పంపిళ్లేమిటి ? పల్నాడంతా ఒక టే గడ్డ.

కా : ఇదివరకు మనది. పోతుగ డ్డనిపించుకున్నది. చుట్టుపట్ల రాజ్యాలలో మన మన్నమాటల్లా చెల్లింది. ఇతరులు మనవంక తేరిచూడలేకపోయినారు.

పా: ఇవ్వాళ పల్నాడు రెండు చీలికెలు చేశారు. రేపు నాలుగు చేసుకుంటారు. వాండ్ల దేమిపోయింది ? వాండ్ల వుసులు వాండ్లు జూచుకున్నారు. మన కష్టాలు దెలిసినవాడు బ్రహ్మనాయుడై నా చెప్పకూడదూ?

కా: నీదంతా తెలియనిసోది. పంపిణీకి మూలకందం బ్రహ్మనాయుడే అయితే, ఆయనను వద్దనమంటావేమి ?

ఇవ్వాళ రెండు చీలికెలు చేశారు. రేపు నలుగురు పంచుకుంటారు. అప్పుడు నలుగురివి నాలుగుదారు లవుతవి. ఎదుటివాడికి పలచదనంగాదూ?

పా: పోయింది. పల్నాటిపేరు పోయింది. ఇక పల్నాటిపేరు మాసిపోయి చీలిక కొక కొత్తపేరు పుడుతుంది.

కా: ఎక్కడబోయింది ? పెద్దవాండ్లలోకూడ కదలిక బుట్టింది. సన్నగా రాజుతున్నది. కేతురెడ్డి మొన్న నాతో హెచ్చరించాడు. తరువాత యేమయిందో తెలియలా?