పుట:Naayakuraalu.Play.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

నాయకురాలు

తగవులాడారు. ఆ పగ తీర్చుకోవడానికి విష్ణుహంశలో బ్రహ్మనాయుడు, శక్తిహంశలో నాగమ్మ జన్మించారు. ఆ రెండు పాత్రలను బెట్టి నే నాటకం నడిపిస్తా. మీరు నాటకం చూస్తూవుండండి. నే మళ్లీ వచ్చి నా లీలలు యింకా మనవిచేస్తా. {{c|( నిష్క్రమణము )||

1-వ రంగము

గురిజాల - కోట పహరా

[ ప్రవేశము - పొదిలె పాపన్న ]

పాపన్న : అబ్బా ! చలికి వేళ్లు కొంగరుబోతున్నవి. ఎన్నిసార్లు పచారుజేసినా ఒంటికి వేడెక్కందే ! కాస్త దమ్ము పీల్చంది లాభంలేదు.

[ చుట్ట తాగుతూ ] ఎవ రా వచ్చేది ? పగవాండ్లా, స్నేహితులా?

[ కల్వగుంట కాశీపతి ప్రవేశము ]

కాశీపతి : నేనే.

పాపన్న : నేనే అంటే?

కా.ఎవరనై నా అనుకో.

పా : కాశీపతీ, శత్రుడవా, మిత్రుడ వా?

కా: ఎవరయిందీ యెట్లా జెప్పను, నీ సంగతి తేలందే ?

పా: తేలే దేమున్నది, పొట్టే తెలుస్తుంది.

కా: సామాన్యంగా అంతే అనుకో, మనబోటివాండ్లదే కష్టం