పుట:Naayakuraalu.Play.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

1-వ అంకము

[ ప్రవేశము - ప్రతాపుడు ]

ప్రతాపుడు : నా పేరు ప్రతాపుడు. సౌందర్యవల్లి నా తోబుట్టువు. మాది మొదట శక్తి రూపం.

ప్రపంచములో సృష్టి స్థితి లయాలని మూడున్న వంటారు గాని, జరుగుతున్నవి రెండే కార్యాలు. అవి సంకోచ వికాసాలు. స్థితిలో మొదటి భాగం వృద్ధి ; రెండవది క్షీణత. వృద్ధి సృష్టి కార్యములోని భాగమే. క్షీణదశ లయములో జేరుతుంది. కనుక ప్రపంచములో సంకోచ వికాసాలు రెండే వున్నవి. అనగా సృష్టి, లయము అనే రెండుపనులే జరుగుతున్నవి.

సౌందర్యవల్లి సృష్టిని జేస్తుంది, నావల్ల లయం జరుగుతుంది. సౌందర్యవల్లి స్వరూపం శృంగారం, నా స్వరూపం రౌద్రం. సృష్టి జేయడం నా సోదరికి నిత్యలీల, లయింప జేయడం నాకు నిత్యలీల. మొదటినుంచీ నా కిదే పని. ఏదో నెపం బెట్టి నాపని నే జరిగించుకుంటుంటా.

నా నాటకానికి అంతులేదు. ఇదివర కెన్నో రంగాలయినవి. ఇంకా యెన్నో కావలసివున్నవి. పల్నాటిరంగం ఒకటి చూపించవలెనని వచ్చా. ఆఁ విన్నారా? ముందుగా దేవరహస్యం ఒకటి చెపుతా. పూర్వం విష్ణూ, శక్తీ - ఇద్దరూ