పుట:Naayakuraalu.Play.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvi

ఏవో వేదాంతములుగా పొడగట్టినా, ఈ నాటకముయొక్క తత్త్వ మంతయును వీటిపైననే ఆధారపడియున్నది. మొదటియంకము నారంభమున సృష్టిస్థితి లయముల తత్త్వమును ఉపన్యసించి, ప్రపంచము కేవలము సంకోచ వికాసములద్వారా ప్రవృత్తులను జరపుచున్నదని నిరూపించి, పల్నాటియుద్ధరంగప్రదర్శనము తటస్థించిన మూలకారణములను చక్కని మాటలతో తేటగా వెల్లడిచేయించిన పట్టులు తాత్త్వికులకు అపరిమితమగు నానందమును కూర్చునవియై యున్నవి. పిమ్మట రెండవ యంకము ఆరంభములో మఱల ప్రతాపుని ప్రవేశపెట్టి, ప్రధాన సిద్ధాంతములగు సంకోచ వికాసములను ప్రదర్శించుట కెట్టి సాధనసామగ్రి ఆవశ్యకమైనదియును సూచింప చేసినారు. ఈ సందర్భములో వీరు వ్రాసిన "అజ్ఞానం పశుత్వ చిహ్నం" మొదలయిన వాక్యజాలము సందిగ్దాభిప్రాయము గలవారి కన్నులకు మహోపదేశమును గావించు దివ్యాంజనపు ఘుటికలనియే చెప్పవచ్చును. తర్వాత మనకు ప్రతాపపాత్రము మూడవ అంకము నారంభమున దర్శనమిచ్చి , హింస అహింసా ధర్మముల యాథాతథ్యమును కలరూపున నెఱిగించునప్పుడు, ఏపాటి చేతనము కలవారికైనను ఒడలు జలదరింపక మానదు. దీనిలో పశుత్వ చిహ్నమైన అజ్ఞానపు పూర్ణస్వరూపమును చిత్రించి మున్ముందటి యంకములలో రాగల యద్దాని విభ్రమవిలాసముల స్వరూపమును అద్భుతముగా చిత్రించినారు. ఈ సందర్భమందలి వాక్యములు లోకశాంతి నాకాంక్షించు పెద్దలందఱును ఒక్కమారైనను మననము సేయుట కర్హములని నా విజ్ఞప్తి.

ఆ తర్వాత నెప్పటియట్టులు నాలవ అంకము ఆరంభములో ప్రతాపుడు దర్శనమిచ్చును. కాని వెనుకటి ప్రతాపస్వరూపము మాత్రము కాదు. ఇచ్చటి ప్రతాపుడు అద్వితీయ బ్రహ్మతేజుఃప్రపూర్ణమైన, క్రౌర్యవిహీనమైన అహింసతో సహకారము నొనర్చుచు నిత్యత్వవ్రతముయొక్క విజయస్వరూపమును చిత్రించు ప్రతాపుడు మాత్రమే, మన కిచ్చట కన్పడుచున్నాడు. ఈ నాటకములో తక్కిన