పుట:Naayakuraalu.Play.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiv

సవిమర్శగా చదువుటకు దొరకొను పాఠకవర్గము మున్ముందుగా నీ విషయమును తెలిసికొని యుండుట మిగుల ముఖ్యమని నా యభిప్రాయము.

ఇక ప్రస్తుతమునకు వచ్చుచున్నాను. శ్రీ లక్మీనారాయణపంతులుగారు నాయకురాలిని నిర్మించుటలో కౌరవ-పాండవ యుద్ధగాథను ప్రధానాదర్శముగా గొన్నారు. కావుననే బ్రహనాయుని పాత్రమును పోషించుటలో అన్నివిధముల నజాతశత్రుని పాత్రము ననుకరించి అతని సత్యవ్రతభంగ భీరుత్వమును, ఆయన శ్రమ ప్రధానమగు శీలమును, శాంత్యాకాంక్షను, కులాభివృద్ధిని, స్వజనానురక్తిని, స్వదేశాభిమానమును సంపూర్ణముగా నిందు పోషించుటకై తమ యావచ్ఛక్తిని వినియోగించి ధన్యులై నారు. బ్రహ్మనాయునికి ఎదిరిపాత్ర మగు నాయకురాలిని తీర్చుటలోగూడ తొలుదొల్త స్త్రీసామాన్యమునకు సహజమున్నూ, గ్రామీణస్త్రీలకు తప్పనిసరిదియును అగు ముగ్ధభావమును, కోమలహృదయతను, అమాయికత్వమును, ప్రాకృతజనవాత్సల్యమును గల నాయికగా వర్ణించినప్పటికిన్నీ, రాజ్యతృష్ణచే కఠినమైపోయి స్వీయనాశమును కూడ లక్ష్యముసేయని రారాజు హృదయకాఠిన్యమునూ, శత్రు మారణమునకై ఎట్టి యధర్మమార్గములనైనను తొక్కెడి సామర్ష బుద్ధిన్నీ, అకారణద్వేషమున్నూ కనులకు కట్టినట్లు తీర్చి అధికారాంధకార మన్న నెట్టిదియో ఆ పాత్రమున ప్రదర్శించినారు. బ్రహ్మనాయుడు-నాయకురాలు అను నీ యుభయపక్షములలో పరస్పర ద్వేషమును, అన్యోన్యసంఘర్షణమును పెంచి కథ నడుపుటకై , ఒకరికి సర్వవర్ణసమత్వమూ, రెండవవారికి కేవలము ఆర్యజనవిభక్తమగు వర్ణాశ్రమధర్మరక్షణమూ అనువాని నవలంబనముగా గొని, యుభయపక్షములవారు తమ తమ బలమును అభివృద్ధిచేసికొనుటలో వీనిని ప్రధాన సాధనములుగా దేశకాలపరిస్థితులను గ్రహించినట్లు ఇందు నిరూపించినసందర్భము ఈకాలములోని మనకు ఒకరకపు ఛాయలను సూచించుచున్నట్టు లున్నప్పటికిన్నీ, అవి నిక్కమగు చరిత్రాంక