పుట:Naayakuraalu.Play.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

మెక్కించుటతో ఆరవ రంగమును ముగించిరి. దీనితో నాయకురాలి నాటకమును ముగియును.

పాత్రపోషణ విధానము

ఆంధ్రదేశమునందలి ఆధునిక గ్రంథకర్తలలో ప్రతిభా ప్రాభవ విషయమున శ్రీ లక్ష్మీనారాయణ పంతులుగారు మిన్నలు . దేశభక్తి, భాషాభిమానము, జాతీయాభిమానము అను సుగుణములు వీరికి వెన్నతోబెట్టినవి. ఆంధ్రదేశపు చారిత్రికవిజ్ఞాతలలో మా యెఱింగినంతవట్టునకు ఇంతటి యభినివేశముతో, ఇంతటి యానుపూర్వితో ఆంధ్రదేశపు ప్రాచీనచరిత్రాంశములను చెప్పగలవా రీ కాలములో నరుదుగా నున్నారు. మన మధ్యరాష్ట్రమునందు పేరెన్నికగల స్థలపురాణము లెన్ని గలవో, ప్రభువులు మొదలగు స్థానికపరిపాలకు లెవ్వరెవ్వరి ప్రభుత్వములో మన సాంఘిక సారస్వత విషయములందు ఏ యే విధములగు మార్పులు, కూర్పులు జరుగుచువచ్చినవో, హృద్గతముగా (హృదయవేదిగా) సంవత్సర మాస పక్ష తిథుల సంఖ్యలతో కూడ, నిస్పటికిని ఏకరువుపెట్టి సమన్వయముచేయగల శక్తి వారికున్నది. శైవమతవిజృంభణాంతమునగల సాంఘిక, సారస్వతముల స్థానికచరిత్రములను సాధారణముగా వారు కోరినంతనే వప్పగింపగలరు. ఇది నా స్వానుభవ విషయము, ఆంధ్రలోకమునకు కాన్కగా పంతులుగారు వ్రాసిన 'మాలపల్లి ' యను గ్రంథమును చదువుటమూలముగా నియ్యది అనుభూతమైన విషయమై యుండుట చేత ఇక దీనినిగుఱించి విశేషించి చెప్పవలసిన పని యుండదని నా విశ్వాసము. ఆంధ్రమహాభారతమును విశేషమగు విమర్శనముతో వీరు చదివినన్ని మారులు ఇఁక నిప్పటిపండితులుగూడ నెవ్వరును చదివియుండ రన్నను తప్పు కాదు. కలముపోటునందును, కత్తిపోటు నందును సమానమగు విఖ్యాతిని గడించిన తిక్కనసోమయాజియొక్క విరాటోద్యోగములు ఈయన సొమ్ము. కనుకనే చిరకాలమునుండి తాము చేసిన రాజనీతిధౌరంధర్యమును వీరు ఈ నాటకమునందు ఆదినుండి అంతమువఱకును వెల్లడించియున్నారు. నాయకురాలి