పుట:Naayakuraalu.Play.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

పిమ్మట నాలవ యంకములో అజ్ఞాతవాసఖిన్నులగు బ్రహ్మనాయునిపక్షమువారి తహతహలు, తటపటాయింపులు మొదటిరంగములో పొడగట్టును. ఇట్లే రెండవ రంగములో తత్ప్రతిపక్షులగు నాయకురాలి వ్యూహరచనములును, శత్రుమారణార్థము పన్నిన కుటిలములగు పన్నుగడలును, తన్మూలమున దోలాఁదోళితమగు నాయకురాలి హృదయావేగములును గోచరించును. తరువాత నిందులోనే మూడవ రంగమునందు వనవాసముచే ఖిన్నులై , త త్ల్కేశములమూలమున స్వబలక్షయమునకు గురియై కర్తవ్యము నాలోచించుటకై కూడిన బ్రహ్మనాయుని యాలోచనా గృహమును ప్రదర్శించి, శత్రువుల కుట్రలకు బదులుచేయుటెట్లాయని ఆందోళితములగు మనస్సులతో స్వకర్తవ్యము నన్వేషించుచున్న వీరులను ప్రత్యక్షీకరించుచు నాలవ రంగమును ముగించినారు.

అయిదవ యంకములో ఉత్తీర్ణప్రతిజ్ఞులై స్వస్థానాభిముఖులై వచ్చుచున్న బ్రహ్మనాయునిపక్షమువారిని, వారి మంతనములను మొదటి రంగములోనున్నూ, అలరాజు సంధిరాయబారముతో రెండవ రంగమునున్నూ ప్రదర్శించి, సంధిప్రయత్నముల వైఫల్యమును వెల్లడించి, యుద్ధమున కంకురార్పణ చేయించినారు. దీనితో అయిదవ యంకము ముగియును.

తర్వాత ఆరవ అంకము ఆరంభమగును. ఇందులో మొదటి రంగమునందు యుద్ధరంగప్రదర్శనము ఆరంభమై నాయకురాలి పక్షమువారికి మొదటి గెలుపు చేకూరుటయును, పిమ్మట రెండవ రంగమునందు స్వపక్షపరాభవమును, తోకత్రొక్కిన త్రాచులవలె విజృంభించిన బ్రహ్మనాయుని పక్షమువా రొనర్చిన పూర్ణాహుతియును, దానితో నాయకురాలి పక్షమువారు లొంగి బ్రహనాయుని శరణు సొచ్చుటయును, “వీరపురుషోచితమైన రణమరణభాగ్యము తనకు గలుగదయ్యెనుగదా" యన్నవగపుతో విక్లబుడై యున్న బ్రహ్మనాయుని సమీపించి, నాయకురాలిపక్షమువారు క్షమాపణవేడి ఆశీర్వదింప గోరుటయును ప్రదర్శించి నలగామరాజును గురిజాల సింహాసన