పుట:Naayakuraalu.Play.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

125

నాయకురాలిపై కురికి ఆమె రథ్యలను, సారధిని అంత మొందించి రథముపై దుముక నుంకించాడుగాని....

బ్రహ్మ : ఇప్పుడేమి ప్రయోజనము ? ఆమె చేయదలంచిన దంతా చేసినది. సంకల్పసిద్ధురాలు.

కొమ్మ : ఇంతలో ఏమి జరిగినది ?

నౌ : బాలుని జంపిన సైన్యములన్నీ పెదమల్లభూపతిపై తిరుగగా, కన్న డామెను విడిచి, బాలుని మరణముచే భయపడి పరుగెత్తుతున్న స్వసైన్యముల బురికొల్పుకొని, రాజు రక్షణార్థమై బరుగెత్తగా, నామె కేత రెడ్డి రథముపై నెక్కి మల్లభూపతిపై దిరిగినది.

బ్రహ్మ: ఇంకెక్కడి మల్లభూపతి ? మన మిక్క డెందుకు ? పోదాము లెండి.

[ క ల క ల ము ]

[ కన్నమదాసు - తెరలో ]

చమూపతులారా ! అట్లు పిరికిపందలై పారిపోతారేల ? మల్లభూపతి యిక్కట్టులో నుండగా ముందంజ వేయరేమి ?

బ్రహ్మ : ఎవరురా ? రథము, రథము.

క. దా : ( తెరలో) కుమారా ! ఎంతచెప్పినా వినకపోతివిగా. ఎవరూ నామాట విని ప్రభువునకు తోడ్పడేవారు లేరా ? మాచర్లమండలాధిపతి, పేర్వడిసిన వీరానీకమునకు నాథుడయిన రాజాగ్రణికే దిక్కులేని చావు సంభవించినదా ? అయ్యో ! యెంతకష్ట మెంత కష్టము?

బ్రహ్మ : సేనాధ్యక్షుని మాట వినువారుకూడా లేక పోయిరిగా ! అంతయు ముగిసినది. మన కిక ప్రపంచముతో ?