పుట:Naayakuraalu.Play.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

నాయకురాలు

సంగ్రామమునకు దార్కొన్నవి. నరసింగభూపతి మరణమునకు కారణమయిన బాలచంద్రునిపై నాయకురాలు, కేతురెడ్డి, కోలంకి వీరాస్వామి, పొన్నాళ్ల రామానాయుడూ, పొదిలె పాపన్నా, కల్వగుంట కాశీపతీ మొదలైన వీరానీకమంతా ఒక్కుమ్మడిని దలపడ్డారు. బాలచంద్రుని యుద్ధమును ప్రత్యేకము వర్ణించడముకంటె పద్మవ్యూహమునాటి అభిమన్యుని యుద్ధమును మించినదని చెప్పితే చాలును.

బ్రహ్మ : ఇతరులెవ్వరూ అతనికి తోడ్పడలేదా ?

నౌ : బాలు డొంటరిగ నుండుటంగని తమ సోదరులైన పేరినాయుడూ, సూరినీడూ పొంగివచ్చే సేనాసముద్రమున కడ్డమై ఒక్కగడియ ఘోరముగ పోరాడారుగాని నాయకురాలి ఘోరనారాచములకు బలైనారు.

బ్రహ్మ : ఆహా ! యేమి వారి పుత్రవాత్సల్యము. బాలచంద్రుడు వంశనాశనకారుడని జ్యోతిష్కులు చెప్పినది వాస్తవమయినది.

నౌ : అంతట బాలు డొక్కడే వారి క్రౌర్యమున కగ్గమయినాడు. పలువురు క్రూరనారాచముల బరపీ, ఈటెలతో బొడిచీ, నిరాయుధుం జేసీ, అంతమొందించారుగాని యా బాలుని పరాక్రమప్రదర్శనము నరులకేకాక దేవతలకూ అద్భుతాశ్చర్యముల గొల్పినది.

బ్రహ్మ : బాలచెన్నా ! ని వల్పాయుష్కుడవయినా నీ కీర్తి ఆచంద్రతారార్కము విలసిల్లుతుంది !

నౌ : కన్నమదాసు యెంత ప్రయత్నించినా నాయకురాలి సైన్యము లడ్డుపడడంచేత బాలచంద్రుని జేరలేక , తుద కాతని మరణవార్తనుగూడ విని కసిమసగిన కోల్పులివలె