పుట:Naayakuraalu.Play.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

123

2 - రంగము

కారెంపూడి

[ బ్రహ్మనాయుడు, కొమ్మరాజు : పవేశము ]

బ్రహ్మ: నరసింగరాజుయొక్క మరణవార్త విన్నప్పటినుంచీ నా కావేదనగా వున్నది అలరాజు, పినమలిదేవుల మరణములకే మనసున నొగిలిపోతుంటే గోరుచుట్టుమీద రోకటిపో టన్నట్టు నరసింగరాజుమరణము వీరితోపాటు సమానదుఃఖమునే కలిగిస్తున్నది.

కొమ్మ : అతనిమీద అలరాజును చంపించాడనే క్రోధం మన పిల్లలకు పూర్తిగా వున్నదిగాని సత్యం దేవు డెరుగు. తమ్ముడు పోయినవార్త విని పెదమలిదేవుడు యుద్ధానికి పోయినాడు. ఇదేమి కొంపముంచుతుందో !

నౌ : ( ప్రవేశించి ) మంత్రి మహాప్రభూ ! ఘోరదుర్వార్తలు చెప్పవలసివచ్చినందుకు వెరుస్తున్నాను.

బ్రహ్మ : దేనికయినను వొడిగట్టుకొని సిద్ధముగానే వున్నాను. వెరవక చెప్పు.

కొమ్మ: రాజు క్షేమముగ నున్నాడుగదా !

నౌ : ఆయనమట్టుకు క్షేమమే కాని మన పక్షమున పేరుగల నాయకులందరు పడిపోయినారు.

బ్రహ్మ : అదియేమి ? చెప్పు, చెప్పు.

నౌ: నరసింగరాజు పడిపోంగనే నాయకురాలు సర్వసేనాధిపత్యము వహించినది. అగ్గికి కరువలి తోడయినట్లు రా జామెకు బాసటైనాడు. అది యేమిచిత్రమోగాని అది మొదలు పారిపోతున్న వారి సైన్యములన్నీ కోల్తలై ఘోర