పుట:Naayakuraalu.Play.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

నాయకురాలు

[ ఝట్టి తెరలో ]

కోటకేతురెడ్డి మరలించినా మరలక సైన్యములు విరిగినిర్వీర్యమై పారిపోతున్నవి. ఆహా ! నరసింగభూపతి వీరస్వర్గము నందినాడు.

నల. రా : అయ్యో ! తమ్ముడా! నాయందే నీ ప్రేమంతా వుంచి లక్మణుడు శ్రీరాముని గాచినట్లు న న్నింతవరకు కాచి, రక్షించి న న్నిపుడేల విడిచిపోయినావు? నీవు లేని రాజ్యము నా కెందుకు? నీకై పోరాడబోయిన నాయకురాలికి బాసటై శత్రుసంహారము గావించి నీ ఆత్మసంతృప్తి గలిగింతునుగాక !

ఝట్టి : ( ప్రవేశించి) అన్నయ్యా ! నీ విక్కడనే వుండు. నేను నాయకురాలికి తోడై చినఅన్నయ్యకు దుర్మరణము గలిగించిన యా హంతకుల నంతమొందించి వస్తాను.

నల. రా : తమ్ముడా ! అనాథయై వున్న పల్నాటిరాజ్యమునకు నీవే అధిపతివి గమ్ము. ఇచ్చటనే వుండుము. తమ్ముడు లేని రాజ్యము నాకేల?

ఝట్టి : కాదన్నయ్యా ! నే బోతాను.

నల. రా : వద్దు. ఇది నా యాజ్ఞగా శిరసావహించుము.

ఝట్టి : వద్దన్నయ్యా.

నల. రా : అసహాయుడనై వున్న నా ఆజ్ఞను నీవూ పాలించవా?

ఝట్టి : చిత్తము. మీ యాజ్ఞ శిరసావహిస్తాను.

నల. రా : ఎవడురా! తేరు....

[ నిష్క్రమణం ]