పుట:Naayakuraalu.Play.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

నాయకురాలు

ఝట్టి : తరువాత, ఆహవపాండిత్యమున నారితేరిన నరసింగభూపతిచేత నడుపబడుతూ, వీరాధివీరుడయిన మాడుగుల వీరారెడ్డిచేత అభిరక్షితమయిన మన సేనలన్నీ శకట వ్యూహముగ నమర్చబడి, గంగధారిమడుగు ఉత్తరంగితయై పొంగిపొరలినట్లు గన్పడినది.

నల. రా : అంత నేమయినది ?

ఝట్టి : యుధిష్ఠిర ప్రతిముడయిన....

నల. రా : శత్రువును ప్రశంసించడమూ వీరలక్షణమే .

ఝట్టి : బ్రహ్మనాయుడు ఆహవదోహలుడైన కన్నమదాసునూ, అభిమన్యుకుమారుంబోలు బాలచంద్రుడునూ ముందు నడువగా, అరిభయంకరమయి శత్రుసేన గరుడవ్యూహముగ నమరి మన సేనల ముట్టడించగా సముద్రము లుప్పొంగి ఒండొంటిం దాకినట్లు గన్పడినది.

నల. రా : ఇట్టిదృశ్యములు వీరులహృదయాలను పొంగ జేస్తవి.

ఝట్టి : అంతట ఉభయపక్షములూ వచ్చందాలు బడ్డట్టు యుద్ధము ప్రారంభించక కొంతవడి పూరకున్నారు. బాలు డీ దుస్సహమయిన విరామమును విరమింపజేసి నారాచమొకటి విడువగా ఒక్కుమ్మడిన మన సేనా సముద్రమంతటను అంపజల్లు గురిసినది. మస వారి కవి చిటి చినుకులప్రాయమై సరకుసేయనట్లు గనుపట్టి నా అమ్ములు కుప్పతిప్పలై జడివానగా శత్రువులపై గురిసినవి, ఇట్లు కొంతవడి అమ్ములతో చెర్లాటలాడి, వెట్టబుట్టి, విండ్లు బుజములకు దగిలించి, కృపాణములు, సన్నీలు, బరిసెలు చేతికి దీసికొని తారసిల్లి ముహూర్తమాత్రములో దేహములు గడికండలుగ గోసుకొనసాగారు. రణరంగమంతా