పుట:Naayakuraalu.Play.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

117

నల. రా : ఎవ రేమనుకున్నా నాయం దతనికీ, అతనియందు నాకూ భేదభావం లేదు.

నాయ : వాస్తవం. రెండుజాములయింది. యుద్ధభూమినుంచి యింకా మనుష్యులు రాలేదు.

నల. రా : వాకిట్లో చప్పుడౌతున్నది. ఎవడురా అక్కడ ?

నౌ : ( ప్రవేశించి) రణభూమినుంచి చిన్నదొరగారు వచ్చారు. మిమ్మును చూడగోరుతున్నారు.

నల. రా : తక్షణం రమ్మను.

[ ఝట్టిరాజు ప్రవేశము ]

ఝట్టి : అన్నయ్యా, నమస్కారము.

నల. రా : విజయోస్తు. సమాచారము లేమి ?

ఝట్టి : అలరాజు మరణవార్త శత్రుశిబిరములో తెలియంగనే యుద్ధప్రకటనలు లేకనే బ్రహ్మనాయుడు వారించినా వినక బాలుడూ, అతని అనుచరులూ తోక దొక్కిన తాచులవలె లేచి, రణభేరి వాయించి, యుద్ధమునకు బయలు దేరడమూ ఇక విధిలేక తక్కినవారందరూ వారివెంట బయలుదేరడమూ మీరెరిగిన విషయమే.

నల. రా : అవును తెలుసును. బాలుడు బలుదుడుకుపిండము.

ఝట్టి : చెల్లాచెదరుగా బయలుదేరిన సైన్యము లన్నిటినీ బ్రహ్మనాయుడు మార్గమధ్యమున నిలువరించి, మొగ్గరముగా నమర్చి, కారెంపూడిలో గంగధారిమడుగుదగ్గర విడిసివున్న మనసేనలమీదికి బయలుదేరాడు.

నల. రా: తరువాత? వారి వెంట