పుట:Naayakuraalu.Play.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

నాయకురాలు

6-వ అంకము

[ ప్రతాపుడు ప్రవేశము ]

ప్ర : ఇది భయానకరూపం. మీ కేదో భయంకరంగా వుంటుంది. కాని నాకు అన్నిరసాలు వొకటే. నేను అనేక మార్గాల లోకసంహారం చేస్తూవుంటాను. ఒకరయిలు పడదోస్తా -- అనేకమందికి కాళ్ళు, చేతులు, మెడలు, విరుస్తా. ఒక అడవికి అగ్గిముట్టిస్తా — వేలజంతువులను మాడుస్తా. ఒకప్లేగు దెప్పిస్తా - లక్షులను చంపుతా. నా కేమయినా విచారమనుకొన్నారా ? ఇవన్నీ ఆనందంగా చేస్తా. నేను ఆనంద దాయకుణ్ణి.

[ నిష్క్రమణం ]

2-వ రంగము

కారెంపూడి

[ నలగామరాజు, నాయకురాలు ప్రవేశము ]

నల. రా : అలరాజు కండ్లలో మెదులుతున్నాడు. అల్లు డయినా అతడే, కొడుకయినా అతడేకదా అనుకున్నాను. ఇటు ఘోరవిచారమూ, అటు అపవాదమూ కూడా భరించలేకుండా వున్నాము.

నాయ : పుణ్యం, పాపం దేవుడికి దెలుసు. నోరుముయ్య మూతలేదు. నరసింగరాజుగారిమీద వాండ్లు నిందమోపారు.

నర : అది నే నెప్పుడూ నమ్మను. అతడు చంపవలసిన అవసర మేమి వచ్చింది ? అతడిద్వారా రాజీకూడా కుదిరేది.

నాయ : ఈ అపవాదుచేత ఆయనమనస్సు చాలా వైకల్యం బొందింది ; సేనల నన్నిటినీ నడపవలసిన వాడు.