పుట:Naayakuraalu.Play.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

115

నర : ఉప్పునీళ్లచేత. త్వరగా పదండి. ఈ నీళ్లే మళ్లీ తాగితే నాలుక మరీ విరుస్తుంది. ముం దెక్కడనయినా మంచినీళ్లు తగలక పోతవా ! ( కొంతదూరం పోతారు. ]

[గోసాయిలు పలాయనం ]

అ. రా : అయ్యా ! నాకు కాళ్లు తీస్తున్నవి. నాలుక పీకుతున్నది. మంచినీళ్లు దొరికితే బాగుండు.

నర : మరే. ఊషరక్షే.త్రం. దగ్గరలో నీళ్లు లేవు. త్వరగా అడుగువెయ్యండి.

అ. రా : ఇంకేమడుగులు. ఇక నడవలేను.

[ అని కూలబడతాడు ]

నర : నే బోయి నీళ్లు తేనా ?

అ. రా : నీ......... [ అని ప్రాణము విడుస్తాడు. ]

నర : నడిదార్లో యెందుకు ఈ పీనుగ ; రాయబారం ముగిసింది.

[ శవాన్ని పక్కచేలోకి లాగి నరసింరాజు వెళ్లుతాడు. ]