పుట:Naayakuraalu.Play.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

నాయకురాలు

అ. రా : మిమ్ములను ఈ యెడారిలో వదిలిపెట్టి పోతానా? ఇద్దరం కలిసేపోదాము. గోసాయిలదగ్గర యేమయినా ఎంగిలిపడుతారా?

నర : నా కెన్నడూ స్నానంలేని భోజనం మామూలు లేదు. హరీ అనేదాకా అట్లా జరుగవలసిందే. నాస్తాచెయ్యండి, నన్ను నడిపించుకపోదురుగాని.

గో : అయ్యా, మీరు యెండనబడి వచ్చారు. కలో అంబలో మా కున్నది స్వీకరించండి.

నర : నీళ్లు దగ్గరలో వున్న వా ?

గో : అరమైలు పోవాలె. స్నానంజేసి బిందెలో తెచ్చుకుంటే వంటకురాగా దాహానికి మిగిలినవి. అవీ కటికివుప్పులు, విషప్రాయంగా వున్నవి.

నర : నా సంగతిక వట్టిదే. చిన్నవారు మీకేమి, కాస్త నాస్తా చెయ్యండి. నన్ను నడిపించుకపోదురుగాని.

1. గో : నాకు సంధ్య ఇంకా ఆలస్యమున్నది, వారికి, వడ్డించు.

2. గో : అయ్యా, కూర్చోండి వడ్డిస్తా - (వడ్డించి) - సుకుమారులకు మీకు సయిస్తుందా - కాలేకడుపుకు మండేగంజి. కండ్లు మూసుకొని రెండుముద్దలు మ్రింగండి.

[ తెరలో భోజనమయింది ]

నర : ఇక మెల్లగా నడుస్తామా, కాస్త తేరుకున్నా ?

అ. రా : లెండి. అన్నం తిన్నప్పటినుంచి గుండ్రింపుగా వున్నది. నాలుక విరుస్తున్నది.