పుట:Naayakuraalu.Play.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

113

నర : రెండుకోసులు కాదుగదా, రెండుబారలుకూడా నడవలేను. దగ్గరలో చెట్టేమయినా వుందేమో చూడండి, నీడ వుంటే కాస్త తెప్పరిల్లిందాకా వొడ్డిగిలబడతా.

అ. రా : ఈ పక్కచేలోనే చింతచెట్టువుంది. దానికింద యిద్దరు సన్యాసులుగూడా వున్నట్టున్నారు. నా బుజాన చెయివేసి రెండడుగులు వేస్తారా ?

నర : ఆ కనపడేదేనా ! కండ్లు భ్రమగప్పి లీలగా కనపడుతున్నవి. పదండి. సన్యాసులో, మాచకమ్మలో యెవరయితేనేమి?

అ. రా : దారిన రండి.

నర : ఇళ్ళో.

అ. రా : ఒక్క నిమిషమాగి అలుపు దీర్చుకోండి.

నర: పదండి.

అ. రా : వుండండి, నీడన గుడ్డ పరుస్తా. కాస్త తలవాల్తురు గాని.

నర : ఎవరయ్యా మీరు ?

గో : మేము గోసాయిలం.

నర : బ్రాహ్మలా ? మేము రాజులం.

గో : బ్రాహ్మలమే.

నర : అయితే కాస్త దాహమియ్యండి నాయనా.

[ దాహమిస్తారు ]

నర : (తాగి) తమరు పొద్దుటినుంచి నడిచివచ్చారు. ఇంకా దృఢకాయులుగనుక ఓపికగా నడుస్తున్నారు. మీరు సాగి పదండి. వెనకడితే నేనూ బయలుదేరుతా.